కోరివచ్చెను కారణ జన్ముడే | Kori Vacchenu Karana Janmude Song Lyrics

కోరివచ్చెను కారణ జన్ముడే | Kori Vacchenu Song Lyrics || Latest Telugu Christmas Song by Davidson Gajulavarthi

Telugu Lyrics

Kori Vacchenu Song Lyrics in Telugu

తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ

భూమిని తలక్రిందులుగా చేసే మెస్సయ్యే వచ్చె బాలునిగా  (2)

ఆకాశంలో దూతలు పాడే – భూమి అంతా సంబరమాయే (2)

సింహాసనమే వదిలాడయ్యా – మనుషరూపము దాల్చి వచ్చాడయ్యా

అను పల్లవి:

కోరివచ్చెను కారణ జన్ముడే వచ్చేనే…  వచ్చేనే… (2)

కాడి మోయను కదిలెను కరుణాత్ముడే

1. నశించిపోవుట తనకు ఒప్పనొల్లక – నరరూపం దాల్చి భువికి వచ్చాడయ్యా

కాడి మోయుట భారమని ఎంచక – కరుణాత్ముడే మన భారం మోసాడయ్యా

రాజు మారెను దాసుని గాను – చేసికొనెను రిక్తుని గాను (2)

పశుల పాకలో పరుండినాడయ్యా – నీ కోరకు నా కొరకు మన మెస్సయ్యా

కోరివచ్చెను కారణ జన్ముడే వచ్చేనే…  వచ్చేనే… (2)

కాడి మోయను కదిలెను కరుణాత్ముడే

2. తనకు మనకున్న అడ్డు తెరలను – తొలగించ తానే వచ్చాడయ్యా

లేదు లేదుగా దాస్యమిక లేదుగా – ఆ పరముకు వారసులు నువు నేనుగా

మనకై పుట్టెను ఇలలో రేడు – రక్షణ వచ్చెను  మన ఇంటికి నేడు (2)

సంతోషమునే నింపాడయ్యా – మన బ్రతుకులలో ఆ మెస్సయ్యా

కోరివచ్చెను కారణ జన్ముడే వచ్చేనే…  వచ్చేనే… (2)

కాడి మోయను కదిలెను కరుణాత్ముడే

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics – Music- Tune – Sung by – Davidson Gajulavarthi

Producer – Davidson

Mix and Master – Vinay Kumar (melody Digi – Hyd)

Dop – Vvs Prakash

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro