జాషువా షేక్ గారు ఒక నిరుపేద ముస్లిం కుటుంబములో జన్మించారు. అయన కుటుంబ పరిస్థులు బాగోలేనప్పటికీ తాను మాత్రం చదువులో ముందంజలో ఉన్నారు.
తాను 7వ తరగతిలో స్టేట్ 1st రాంక్ తెచ్చుకున్నారు, 10 వ తరగతిలో స్టేట్ 7th రాంక్ అలాగే ఇంటర్మీడియేట్ లో స్టేట్ 3rd రాంక్ తెచ్చుకున్నారు. తాను ప్రభుత్వ Scholarships తోనే తన బాచిలర్ అఫ్ ఇంజనీరింగ్ ని పూర్తి చేసారు.

తరువాత తాను ఉన్నత చదువుల నిమిత్తమై బిట్స్-పిలానీ లో జాయిన్ అయ్యారు. అప్పటి వరకు జాషువా గారికి యేసు క్రీస్తు ఒక దేవుడు మాత్రమే, అక్కడ అయన తన భార్యను కలుసుకున్నారు. జాషువా షేక్ గారి భార్య మంచి భక్తి పరురాలైన క్రైస్తవ స్త్రీ ల తాను బిట్స్-పిలానీ లో ప్రవర్తించేది. ఆమె కాలేజీలో వర్షిప్ టైం లో చాల సంతోషంగా పాటలు పడేది.బిట్స్-పిలానీ లోనే జాషువా గారికి యేసు క్రీస్తు గురించిన ఆలోచన వచ్చేది.
జాషువా షేక్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జాషువా షేక్ గారు అమెరికా లో ఒక సంవత్సరం నిరుద్యోగ సమస్య వాళ్ళ ఇబ్బంది పడ్డారు.
తరువాత ఒక రోజు అయన ఇంటర్వ్యూ నిమిత్తం ఒక కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా అనుకోకుండా ఒక ట్రక్ అయన కార్ వెనుక భాగాన్ని గుద్దింది. కానీ అద్భుత రీతిగా ఆయనకు ఒక్క గీత కూడా అయన శరీరానికి తగల లేదు.
అయన కార్ వెనుక సీట్ భాగం లోని సూటుకేసి లోని బైబిల్ కిందకు పడింది. అయితే కార్ మాత్రం నుజ్జు నుజ్జు అయ్యింది. వెనుక సీట్ లోని బైబిల్ వలెనే తనకు ఏ ప్రమాదం జరగలేదని అయన తెలుసుకున్నాడు.
ఆరోజు దేవుడు చేసిన అద్భుత కార్యం వల్ల అయన తన మనస్సును యేసయ్యకు ఇచ్చాడు. చనిపోవాల్సిన తనకు యేసయ్య నూతన జీవితం ఇచ్చాడని ఈ జీవితం ఇక యేసయ్య కోసమే జీవించాలని Passion for Christ అనే ministries ని ప్రారంభించి తెలుగు ప్రజలు దేవుని మనసారా ఆరాధించడానికి అనేక క్రైస్తవ గీతాలను రచించి తన సంపాదనతో మ్యూజిక్ Compose చేయించి ఫ్రీ గా Youtube లో రిలీజ్ చేస్తున్నారు.
జాషువా షేక్ గారి వెబ్సైటు : https://joshuashaik.com/
God bless you abundantly sir.
Please Share this article