హృదయమా హృదయమా నా హృదయమా | hrudayama hrudayama na hrudayama song lyrics

హృదయమా హృదయమా నా హృదయమా | hrudayama hrudayama na hrudayama song lyrics || Telugu Christian Hope Song By Pastor Shalem Raju

Telugu Lyrics

Hrudhayamaa Hrudhayamaa Song Lyrics in Telugu

నిన్నే తలచి నిన్నే వలచి – దేవుడే మనుష్యుడైన చిత్రము చూడుమా

ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా

హృదయమా  హృదయమా  నా హృదయమా – యేసయ్య ప్రేమను గాంచుమా

ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా – యేసయ్య స్నేహము గోరుమా  || నిన్నే తలచి ||


1. స్థిరమే లేని మనుషుల ప్రేమలు – నటనయే చూపుచు కదిలే బొమ్మలు (2)

కలుగజేయునే నీకు గాయము – చేయలేవులే ఏ సాయము

గాయాలన్ని గేయాలుగా మార్చును నీకు యేసయ్య

సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట – దాచును మెస్సయ్య

నీలో నిలచి నీతో నడచి

మార్గమే చూపిన మంచి దేవుడు – అనురాగమే పంచిన ఆత్మీయుడు (2) || హృదయమా ||


2. రేపటి తలపుతో నేడే కలతతో – కృంగుట ఎందుకు కలవరమెందకు (2)

నమ్మదగినవాడు నీ దేవుడు – సర్వకాలము నిన్ను విడువడు

వాగ్దానమే నీకుండగ – భయమేలనే ప్రాణమా

వర్ణింపగ సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ

నిన్నే పిలిచి – తనలా మలచే

యేసుపై ఆనుకో నా ప్రాణమా – ఆ యేసునే నమ్ముకో అంతరంగమా (2)  || హృదయమా ||

                                         

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More hope songs

Click Here for more Telugu Christian Hope Songs

Leave a comment

You Cannot Copy My Content Bro