ఎన్నాళ్లో ఉండవమ్మ సాంగ్ లిరిక్స్ | Ennaallo Vundavamma Song Lyrics || A R STEVENSON | Latest Telugu Christian Song
Telugu Lyrics
Ennaallo Vundavamma Song Lyrics in Telugu
ఎన్నాళ్లో ఉండవమ్మ నీ కంటిలోని కన్నీరు
కొన్నాళ్ళే ఓర్చుకుంటే – నీ యింట కురియు పన్నీరు (2)
నీ శ్రమను ఎరిగియున్న దేవుడు – ఏ క్షణము నిన్ను విడిచిపెట్టడు
ఒంటరివి కావు నీవు ఎన్నడూ.. (ఎన్నాళ్ళో)
1.శ్రమకు ఫలము దొరకక మనస్సు గాయమాయేనా
గతపు భయము తొలగక – బలము విగీపోయేన
ఓటమి చీకటై నిన్ను కమ్మివేసినా (2)
తేలిక చేయును……….. – తేలిక చేయును భారం ఏదైనా
ధైర్యం నీయందు కలిగించకుండునా…. (ఎన్నాళ్ళో)
2.స్వరము శృతిలో పలకక గళము మూగబోయిన
పదము సరిగా కుదరక కలము జారిపోయినా
ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసెనా… (2)
సాధ్యము చేయును………. – సాధ్యము చేయును కార్యం ఏదైనా
గీతం నీ నోట పలికించకుందునా….. (ఎన్నాళ్ళో)
3.ఎవరు పలకరించక బ్రతుకు ఘోరమాయెనా
అడుగు సహకరించక పరుగు ఆగిపోయినా
ఆశలు శూన్యమై నిన్ను కృంగదీసెనా (2)
తిన్నగా చేయును ……………. – తిన్నగా చేయును మార్గము ఏదైనా
గమ్యం నీ ముందు కనిపించకుండునా…… (ఎన్నాళ్ళో)
Song Credits
Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More A R Stevenson Songs
Click Here for more A R Stevenson Songs