ఎందుకింత ప్రేమ నాపై | Endukintha Prema Naapai Song Lyrics

ఎందుకింత ప్రేమ నాపై | Endukintha Prema Naapai Song Lyrics || New Year Song By Pastor Asher Andrew

Telugu Lyrics

Endukintha Prema Naapai Song Lyrics in Telugu

ఎందుకింత ప్రేమ నాపై – చూపావు యేసయ్యా

ఆయువున్నంత వరకు – నీ స్తుతినే పాడెదా (2)

పల్లవి:

 ఇశ్రాయేలును కాపాడువాడు – కునుకడు నిద్రపోడు

మమ్ము కాపాడిన మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ (2)

అనుపల్లవి:

ఎందుకింత ప్రేమ నాపై – చూపావు యేసయ్య

ఆయువున్నంత వరకు – నీ స్తుతినే పాడెదా (2)


1. గోతిలోనికి దిగిన – మన్ను నిన్ను స్తుతించునా

గళమెత్తి పాడగలనా – మృతులలోకానా (2)

సజీవులు సజీవులే – నిన్ను స్తుతియించెదరు (2)

ఈ కంఠము మూగబోకముందే – ఆరాధించెదా   || ఎందుకింత ||


2. నిరీక్షణే లేక – కలవరము చెందగా

అడుగులే తడబడగా – ఆప్తులే దూరమైనా (2)

వాత్సల్య కటాక్షములు – ఎంతో ఉన్నతమై (2)

గొప్ప కార్యములు నా యెడల – చేసియున్నావు   || ఎందుకింత ||


3. ఇన్నాళ్లకైనా – ఫలములు కాయకున్నా

ప్రేమతో నీవిచ్చిన – వనరులే వ్యర్ధమైనా (2)

ఈ సంవత్సరము కూడా – ఉండనిమ్మని (2)

విజ్ఞాపనము చేయుచున్న- ప్రధాన యాజక    || ఎందుకింత ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Sung By: Dr.Asher Andrew

Music: Pranam Kamlakhar

More Telugu Christian New Year Songs

Click Here for Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro