చుక్క పుట్టింది ధరణి మురిసింది | Chukka Puttindhi Dharani Murisindhi | Immanuyelu Chukka Puttindhi

చుక్క పుట్టింది ధరణి మురిసింది | Chukka Puttindhi Dharani Murisindhi | Immanuyelu Chukka Puttindhi || Telugu Christmas Song

Telugu Lyrics

Chukka Puttindhi Song Lyrics in Telugu

యుగపురుషుడు – శకపురుషుడు

ఇమ్మానుయేలు – లోకరక్షకుడు


చుక్క పుట్టింది ధరణి మురిసింది (2)

రాజులకు రారాజు వచ్చాడనింది – ఆకాశంలోనా వెలుగే నింపింది

శ్రీ యేసు పుట్టాడని


ఈ బాలుడే – తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని

ఈ బాలుడే – మన పితరులకు వాగ్ధానముచేయబడిన మెస్సయ్య ఇతడేనని

ఈ బాలుడే – తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని

ఈ బాలుడే – నిన్న నేడు నిరంతరము ఉండువాడనీ…


శకమే ముగిసే – నవశకమే మొదలే – నింగి నేల ఆనందముతో నిండెనే

దివినే విడిచే పరమాత్ముడే – పాపం శాపం తొలగింపనేతెంచెనే


శరీరధారిగా భువిలోకి వచ్చెగా – మనకోసమే ఇమ్మానుయేల్

మన పాపశాపముల్ హరింప వచ్చెగా – మన కోసమే రక్షకుడై    (2)


1. జగత్ పునాది వేయక ముందే ఉన్నవాడే – ఉన్నవాడే

అబ్రహాముకంటె ముందే ఉన్నవాడే – ఉన్నవాడే

వెలుగుకమ్మని నోటితో పలికిన వాడే – సూర్య చంద్ర తారలను చేసిన వాడే

నిన్న నేడు నిరతరము నిలిచేవాడు ఈయనే


నిత్యానందము నిత్యజీవము నీకిచ్చును ఇమ్మానుయేల్

నీ చీకటంతయు తొలగింప వచ్చెగా నీకోసమే నీతి సూర్యుడై (2)


2. దుఃఖితులను ఓదార్చుటకు వచ్చినవాడే మన యేసయ్య

పాపమును తొలగించుటకు వచ్చినవాడే మన యేసయ్య

మంటి నుండి మానవుని చేసినవాడే

మహిమను విడిచి మనకోసమే వచ్చాడే

కంటిపాపలా మనలను కాచేవాడు ఈయనే


మహిమాస్వరూపుడే మనుజావతారిగా మహిలోకి వచ్చే ఇమ్మానుయేల్

మన పాపాశాపముల్ హరింప వచ్చెగా – మన కోసమే రక్షకుడై  (2)


చుక్క పుట్టింది ధరణి మురిసింది (2)

రాజులకు రారాజు వచ్చాడనింది – ఆకాశంలోనా వెలుగే నింపింది

శ్రీ యేసు పుట్టాడని

ఈ బాలుడే – తండ్రి పరిశుద్ధాత్మలతో కలిసిన త్రియేక దేవుడని

ఈ బాలుడే – మన పితరులకు వాగ్ధానముచేయబడిన మెస్సయ్య ఇతడేనని

ఈ బాలుడే – తన నోటిమాటతో జగమును సృష్టించిన ఎలోహిం దేవుడని

ఈ బాలుడే – నిన్న నేడు నిరంతరము ఉండువాడనీ…


ఇమ్మానుయేలు – ఎలోహీం

ఇమ్మానుయేలు – ఎల్ షద్దాయి

ఇమ్మానుయేలు – అడోనయ్

యావే…..

ఇమ్మానుయేలు – రాఫా..

ఇమ్మానుయేలు – ఎల్ రోయి..

ఇమ్మానుయేలు – ఎల్ ఓలాం..

షాలోం………………..

ఎల్ ఇశ్రాయేల్ఎల్ హన్నోరా

ఎల్ మిఖాదేష్

ఎల్ హఖావోద్

ఇమ్మానుయేల్…….. ఆమెన్ అనువాడా అల్ఫా ఒమేగా – నిన్న నేడు నిరతము నిలుచు వాడా  (2) 

Song Credits

Song Writer, Composer: Moses David Kalyanapu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro