చిన్నపెద్దా తేడా లేదు | Chinna Pedha Theda Ledhu Song Lyrics

చిన్నపెద్దా తేడా లేదు | Chinna Pedha Theda Ledhu Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Chinna Pedha Theda Ledhu Song Lyrics in Telugu

అంగ రంగ వైభవంగా పండగలేంటంట  – ఊరు వాడ పిల్ల జల్లా సందడి ఏంటంట

ఎక్కడ చూసిన క్రిస్మస్ అంటూ సంబరమేంటంట – ఏం చేస్తారో  ఏం చెప్తారో చూస్తే ఏంటంట

చిన్న పెద్దా తేడా లేదు –  పేద ధనిక భేదంలేదు

పండిత పామర తేడా లేదు  – పల్లె పట్నం తేడా లేదు

భూలోకాన ప్రజలందరికీ పండుగ వచ్చింది

కారణం యేసు జననం (4)

యేసు జననం జగమంతా ఉత్సవం  – యేసు జననం ఊరంతా ఉల్లాసం (2)

చిన్న పెద్దా తేడా లేదు –  పేద ధనిక భేదంలేదు

పండిత పామర తేడా లేదు  – పల్లె పట్నం తేడా లేదు

భూలోకాన ప్రజలందరికీ పండుగ వచ్చింది

1. చీకటి బ్రతుకున వెలుగే వచ్చిన కారణం  – యేసు జననం

పాపము నుండి విడుదల కలిగిన కారణం – యేసు జననం

మరణముపైన విజయము పొందిన కారణం  – యేసు జననం

దేవుని రాజ్యం భువిపైకొచ్చిన కారణం – యేసు జననం

పరమాత్ముని స్వారూప్యమే భువిపైన నడయాడగా

పరలోకపు వైభోగమే భూలోకమునకొచ్చేనే

సంతోషమే యేసు జననం  – సంబరమే యేసు జననం (2)

చిన్న పెద్దా తేడా లేదు –  పేద ధనిక భేదంలేదు

పండిత పామర తేడా లేదు  – పల్లె పట్నం తేడా లేదు

భూలోకాన ప్రజలందరికీ పండుగ వచ్చింది

2. మనిషికి దేవుడు తోడుగా దొరికిన కారణం – యేసు జననం

కృపయు జీవము మనమిల పొందిన కారణం  – యేసు జననం

చెదరిన గుండెకు ధైర్యము నిండిన కారణం  – యేసు జననం

దండగ బ్రతుకున పండుగ వచ్చిన కారణం  – యేసు జననం

పరిశుద్ధుడే పసిబాలుడై చిరునవ్వు లొలికించగా

ఆ చిత్రమే తిలకించిన పరలోకం పులకించెనే

సంతోషమే యేసు జననం  – సంబరమే యేసు జననం (2)

చిన్న పెద్దా తేడా లేదు –  పేద ధనిక భేదంలేదు

పండిత పామర తేడా లేదు  – పల్లె పట్నం తేడా లేదు

భూలోకాన ప్రజలందరికీ పండుగ వచ్చింది

కారణం యేసు జననం (4)

యేసు జననం జగమంతా ఉత్సవం  – యేసు జననం ఊరంతా ఉల్లాసం (2)

సంతోషమే యేసు జననం  – సంబరమే యేసు జననం (2)

Song Credits

Lyrics, Tune & Music – Jonah Samuel

Singers – Jonah Samuel, Aaron, Samuel Prakash, Leslie Luther

Keyboards and Rhythms Programmed by – Jonah Samuel

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro