అసలైన క్రిస్మస్ | Asalaina Christmas Song Lyrics

అసలైన క్రిస్మస్ | Asalaina Christmas Song Lyrics || Latest Telugu Christmas Song by Jonah Samuel

Telugu Lyrics

Asalaina Christmas Song Lyrics in Telugu

అసలైన క్రిస్మస్ మన జీవితమే – ఆరాధన అంటే జీవన విధానమే (2)

క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే – ఇంటా బయట క్రీస్తును ప్రతిబింబించడమే

క్రిస్మస్ అంటే క్రీస్తులా జీవించడమే – ఏదేమైనా దేవుని చిత్తం చేయడమే

అను పల్లవి:

మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన – బ్రతుకంతా ఆరాధన అదేగా మనకు దీవెన (2)

|| అసలైన క్రిస్మస్ ||


1. క్రిస్మస్ తారను చూడు – వెదజల్లే వెలుగును చూడు

జ్ఞానులకే మార్గము చూపిన – దేవుని జ్ఞానం చూడు (2)

దేవుని కోసం వెలిగే తారవు నీవైతే – క్రీస్తుని చేరే మార్గం లోకం కనుగొనదా (2)

ఇదియే ఆరాధన – నిజ క్రిస్మస్ ఆరాధన

మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన – బ్రతుకంతా ఆరాధన అదేగా మనకు దీవెన (2)

|| అసలైన క్రిస్మస్ ||


2. పశువుల తొట్టెను చూడు – పవళించిన క్రీస్తును చూడు

ప్రజలందరిని రక్షించుటకై – దాసుని రూపము చూడు (2)

క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటే – దేవుని ప్రేమ నలుదిశలా వ్యాపించునుగా (2)

ఇదియే ఆరాధన – నిజ క్రిస్మస్ ఆరాధన

మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన – బ్రతుకంతా ఆరాధన అదేగా మనకు దీవెన (2)

|| అసలైన క్రిస్మస్ ||


3. గొల్లలు జ్ఞానులు చూడు – శుభవార్తను నమ్మిరి చూడు

యేసును చూసే ఆశను కలిగి – ముందుకు సాగిరి చూడు (2)

యేసుని చూసే ఆశను కలిగి జీవిస్తే – దేవుడు నిన్ను నిశ్చయముగ దర్శించునుగా (2)

ఇదియే ఆరాధన – నిజ క్రిస్మస్ ఆరాధన

మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన – బ్రతుకంతా ఆరాధన అదేగా మనకు దీవెన (2)

|| అసలైన క్రిస్మస్ ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Music & Vocals – Jonah Samuel

Keys, Guitars & Rhythms – Jonah Samuel

Mixed & mastered by Jonah Samuel

Video edited by Jonah Samuel

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro