రాజులకు రారాజు యేసు | Rajulaku Raraju Yesu Song Lyrics || Telugu Christmas Song
Telugu Lyrics
Rajulaku Raraju Yesu Song Lyrics in Telugu
రాజులకు రారాజు యేసు – జనన మొందిన రోజు (2)
హల్లెలూయా పల్లవులతో – హల్లెలూయా స్తోత్రములతో
వెల్లివిరిసిన గానం – దూతగానముల గీతం (2) || రాజులకు ||
1. రెండు వేల వత్సరాలుగా పరిమళించిన గానం – మలినమైన హృదయసీమను
శుద్ది చేసెడి భావం (2)
మరణకరమగు మనిషి బ్రతుకులో (2)
జీవకాంతుల శాంతి కిరణం
ఈ గానం హల్లెలూయా – ఈ భావం హల్లెలూయా (2)
2. దైవ ప్రేమ దీన రూపమై భువిలో వెలసిన వేళలో – భావి జీవన దివ్య దీపమై
కాంతిలీనుచు త్రోవలో (2)
పరమ పురమును చేరువరకును (2)
అరుణ శోభల కాంతి కిరణం
ఈ గానం హల్లెలూయా – ఈ భావం హల్లెలూయా (2) || రాజులకు ||
Song Credits
Lyrics,Tune: Sis. Deepa Sudhakar Bandaru,
Sung By: Sis.Sharon Philip,
Directed By: David Varma
produced by: Beloved Children Of (Late) Smt & Sri.Vedaraju garu Vemula,
Music: Immi Johnson,
POST-PRODUCTION: 4FRAMES Team,
Title Art & Design: Faith Arts
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs