Telugu Lyrics
Adviteeyuda Song lyrics in Telugu
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం – ప్రతిఫలింపజేయునే ఎన్నడూ (2)
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా || మదిలోన నీ ||
1. ప్రతి గెలుపు బాటలోన – చైతన్య స్పూర్తి నీవై – నడిపించుచున్న నేర్పరి
అలుపెరగని పోరాటాలే – ఊహించని ఉప్పెనలై – నను నిలువనీయని వేళలో
హృదయాన కొలువైయున్న- ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై…
తడికన్నులనే తుడిచిన నేస్తం – ఇలలో నీవేకదా…. యేసయ్యా … || మదిలోన నీ ||
2. నిరంతరం నీ సన్నిధిలో – నీ అడుగుజాడలోనే – సంకల్పదీక్షతో సాగేదా
నీతో సహజీవనమే – అధ్యాతిక పరవశమై – ఆశయాలదిశగా నడిపెనే
నీ నిత్య ఆదరణే – అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి – నా సేదదీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి – నీ కొరకు సాక్షిగా… యేసయ్యా… || మదిలోన నీ ||
3. విశ్వమంతా ఆరాధించే – స్వర్ణరాజ్య నిర్మాతవు – స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు – ఆ ఘడియ వరకు విడువకు
నేవేచియున్నాను నీ రాకకోసమే – శ్రేష్ఠమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా….
నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా….. యేసయ్యా…. || మదిలోన నీ ||
English Lyrics
Adviteeyuda Song lyrics in English
Madhiloni Nee Roopam Nee Nithya Sankalpam – Prathiphalimpajeyune Yennadu… (2)
Kalanaina Thalanchaledhe Neelo Ee Saubhagyam
Varninchalenu Swami Nee Goppa Karyalanu
Nee Satileru Ilalo Adviteeyuda || Madhiloni Nee ||
1. Prathi Gelupu Batalona – Chaithanya Spoorthineevai – Nadipinchuchunna Nerpari
Aluperugani Poraatale – Oohinchani Uppenalai – Nanu Niluvaneeyani Velalo
Hrudhayaana Koluvaiyunna – Israyelu Dhaivamaa
Jayamicchi Nadipinchithive Nee Kyathikai…
Thadikannulane Thudichina Nestham – Ilalo Neevekadhaa… Yesayyaa… || Madhiloni Nee ||
2. Nirantharam Nee Sannidhilo – Nee Adugujaadalone – Sankalpadheekshatho Saagedhaa
Neetho Sahajeevaname – Aadhyathmika Paravasamai – Aasayaladhisagaa Nadipene…
Nee Nitya Aadharane – Annintilo Nemmadhinicchi
Naa Bharamanthaa Theerchi – Naa Sedhadheerchithivi
Nee Aathmatho Mudrinchithivi – Nee Koraku Saakshigaa… Yesayyaa || Madhiloni Nee ||
3. Viswamanthaa Aaradhinche – Swarnaraajya Nirmathavu – Sthapinchumu Nee Prema Saamrajyamu..
Shuddhulaina Vaariki Phalamulicchu Nirnethavu – Aa Ghadiya Varaku Viduvaku
Nevechiyunnaanu Nee Raakakosame – Sreshtamaina Swasthyamu Kosam Siddhaparachumaa….
Naa Oohalalo Aasalasaudham Ilalo Neevenayyaa… Yesayyaa… || Madhiloni Nee ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Adviteeyuda Ringtone Download
Track Music
Adviteeyuda Track Music
More Hosanna Songs
Click Here for more Hosanna Ministries Songs
Nice song
Heart touching song