అదిగదిగో అల్లదిగో | Adigadigo Alladigo Song Lyrics in Telugu

అదిగదిగో అల్లదిగో ll Adigadigo Alladigo ll Good Friday Song Lyrics

Telugu Lyrics

Adigadigo Alladigo Song Lyrics in Telugu

అదిగదిగో అల్లదిగో – కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో     || అదిగదిగో ||


1. గెత్సేమను ఒక తోటదిగో – ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)

అచటనే యుండి ప్రార్ధించుడని (2)

పలికిన క్రీస్తు మాటదిగో (2)    || అదిగదిగో ||


2. శిష్యులలో ఇస్కరియోతు – యూదాయను ఒక ఘాతకుడు (2)

ప్రభువును యూదులకప్పగింప (2)

పెట్టిన దొంగ ముద్దదిగో (2)      || అదిగదిగో ||


3. లేఖనము నెరవేరుటకై – ఈ లోకపు పాపము పోవుటకై (2)

పావనుడేసుని రక్తమును గల (2)

ముప్పది రూకల మూటదిగో (2)     || అదిగదిగో ||


4. చలి కాచుకొను గుంపదిగో – ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)

మూడవసారి బొంకిన వెంటనే (2)

కొక్కొరొకోయను కూతదిగో (2)      || అదిగదిగో ||


5. యూదుల రాజువు నీవేనా – మోదముతో నీవన్నట్లే (2)

నీలో దోషము కనుగొనలేక (2)

చేతులు కడిగిన పిలాతుడాడుగో (2)    || అదిగదిగో ||


6. గొల్గొతా స్థల అద్దరిని – ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)

సాక్షాత్తు యెహోవా తనయుని (2)

సిలువను వేసిరి చూడదిగో (2)     || అదిగదిగో ||


7. గొల్లున ఏడ్చిన తల్లదిగో – ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)

యూదుల రాజా దిగి రమ్మనుచు (2)

హేళన చేసిన మూకదిగో (2)     || అదిగదిగో ||


8. దాహము గొనుచున్నాననుచు – ప్రాణము విడిచెను పావనుడు (2)

పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)

మన మది యేమో గమనించు (2)     || అదిగదిగో ||

English Lyrics

Adigadigo Alladigo Song Lyrics in English

Adigadigo Alladigo – Kalvari Mettaku Dharadhigo

Aa Prabhuvunu Vesina Siluvadhigo    || Adigadigo ||


1. Gethsemanu Oka Thotadhigo – Aa Thotalo Prardhana Sthalamadhigo (2)

Achatane Undi Prardhinchudani (2)

Palikina Kreesthu Maatadhigo (2)     || Adigadigo ||


2.Sishyulalo Iskariyothu – Yoodhayanu Oka Ghathakudu (2)

Prabhuvunu Yoodhulakappagimpa (2)

Pettina Dhonga Muddhadhigo (2)     || Adigadigo ||


3.Lekhanamu Neraverutakai – Ee Lokapu Papamu Povutakai (2)

Paavanadesuni Rakthamunu Gala (2)

Muppadhi Rookal Mootadhigo (2)       || Adigadigo ||


4. Chali Kachukonu Gumpadhigo – Aa Pethuru Bonkina Sthalamadhigo (2)

Moodavasari Bonkina Ventane (2)

Kookkorokoyanu Koothadhigo (2)        || Adigadigo ||


5. Yudhula Rajuvu Neevenaa – Modhamutho Neevannatle (2)

Neelo Dhoshamu Kanugonaleka (2)

Chethulu Kadigina Pilathadadugo (2)    || Adigadigo ||


  6. Golgotha Sthala Addharini – Aa Iddaru Dhongala Madhyamuna (2)

Saakshyatthu Yehova Thanayuni (2)

Siluvanu Vesiri Choodadhigo (2)       || Adigadigo ||


7. Golluna Yedchina Thalladhigo – Aa Thalliki Cheppina Maatadhigo (2)

Yudhula Raaja Dhigi Rammanuchu (2)

Helana Chesina Mookadhigo (2)       || Adigadigo ||


8. Dhahamu Gonuchunnananuchu – Pranam Vidichenu Paavanudu (2)

Parishuddhudu Mana Rakshakudesu (2)

Mana Madhi Yemo Gamaninchu (2)      || Adigadigo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Leave a comment

You Cannot Copy My Content Bro